: భూమా బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ
నంద్యాల ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. `ఎన్డీయేకు ఎంతో విలువైన మద్దతుదారు టీడీపీ తరఫున నంద్యాలలో ఘనవిజయం సాధించినందుకు భూమా బ్రహ్మానందరెడ్డి గారికి నా కృతజ్ఞతలు` అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ, వైసీపీలు గట్టిగా పోటీపడ్డాయి. ఈ పోటీలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.