: త‌న కూతురు కూడా జైల్లో ఉండాలని గుర్మీత్ బాబా పిటిష‌న్‌.. జైలు అధికారులను బెదిరించిన వైనం!


పోలీసు క‌స్ట‌డీలో ఉన్న సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్.. తాజాగా ఓ పిటిషన్‌ వేశారు. జైలులో తనతో పాటు తన కుమార్తె హనీప్రీత్‌ ఇన్సాన్‌ కూడా ఉండాలని గుర్మీత్‌ ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. తన దత్తత కూతురు, తాను ఒకే జైల్లో ఉండాలనుకుంటున్నామని కోరారు. దీనిపై స్పందించిన‌ సీబీఐ న్యాయస్థానం.. అందుకు ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో స‌ర్కారు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. త‌న తండ్రికి నడుము నొప్పి, మైగ్రేన్‌ ఉందని ఆయనకి తరచూ ఆక్యూప్రెజర్‌ చేస్తుండాలని హనీప్రీత్ కూడా కోర్టును కోరింది. అంతేకాదు, తన కూతురిని జైలుకి రప్పించాలంటూ రోహ్‌తక్‌ జైలు అధికారులను గుర్మీత్‌ బాబా బెదిరించినట్లు తెలుస్తోంది. త‌న మాట విన‌క‌పోతే జైలు అధికారులను సస్పెండ్‌ చేయిస్తానని కూడా అన్నారు.

  • Loading...

More Telugu News