: స్వలింగ వివాహ వీడియోను ట్వీట్ చేసిన రవీనా టాండన్... విమర్శించిన నెటిజన్లు
2015లో స్వలింగ వివాహం చేసుకున్న సందీప్, కార్తీక్‌ల పెళ్లి వీడియోను నటి రవీనా టాండన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వారి జంట ఒక్కటైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. సందీప్, కార్తీక్‌లు భారత సంప్రదాయంలో పెళ్లి చేసుకుని దేశ పరువును తీశారని, దానికి రవీనా మద్దతు పలకడం ఏం బాగోలేదని మండిపడ్డారు. మరికొంత మంది మాత్రం ఇలాంటి వివాహాలను అర్థం చేసుకోవాలంటే పెద్ద మనసు కావాలని, అది భారతదేశంలో చాలా మందికి లేనందుకు సిగ్గుగా ఉందని కామెంట్ చేశారు. దీనిపై రవీనా ఎలాంటి సమాధానం రాలేదు. ఎప్పుడో జరిగిన పెళ్లిని ఆమె మళ్లీ ఎందుకు తెరమీదికి తీసువచ్చారో కూడా ఎవరికీ అర్థం కాలేదు.