: క్లీన్ 200 జాబితాలో 7 భారత కంపెనీలకు చోటు
పర్యావరణానికి హాని కలగకుండా, క్లీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న టాప్ 200 కంపెనీల్లో ఏడు భారత్ కంపెనీలు ఉన్నాయి. సుజ్లాన్ ఎనర్జీ (55వ స్థానం), భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ (85), టాటా కెమికల్స్ (144), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (155), ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ (167), థెర్మాక్స్ లిమిటెడ్ (169), హావెల్స్ ఇండియా (200) కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. యాజ్ యూ సో, కార్పోరేట్ నైట్స్ స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన ఈ కార్బన్ క్లీన్ 200 జాబితాలో మ్యూనిచ్‌కు చెందిన సీమన్స్ ఏజీ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చైనా నుంచి 68 కంపెనీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితా రూపకల్పనలో ఆయిల్ అండ్ గ్యాస్, బొగ్గు, ఆయుధ కంపెనీలను పరిగణలోకి తీసుకోరు.