: అది అన్నిటికన్నా బాధాక‌ర‌మైన విష‌యం!: న‌ంద్యాలలో ఘోర‌ ఓట‌మిపై జ‌గ‌న్


నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితాల్లో త‌మ పార్టీ ఘోరంగా ఓడిపోయిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అన్ని ర‌కాలుగా అధికార‌ దుర్వినియోగం చేసినా, డ‌బ్బుపంపిణీ చేసినా ఎంతో మంది ప్ర‌జ‌లు బెద‌ర‌కుండా త‌మ‌కు ఓట్లు వేశార‌ని అన్నారు. ఓ విష‌యం అన్నిటిక‌న్నా బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని, తమకు ఓట్లు వేయకపోతే పింఛ‌న్లు ఇవ్వ‌బోమ‌ని టీడీపీ భ‌య‌పెట్టింద‌ని అన్నారు.

అయిన‌ప్ప‌టికీ ఎంతో మంది ఓట‌ర్లు త‌మ‌కు ఓట్లు వేశార‌ని, త‌మ‌కు ఓట్లు వేసిన వారికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నానని జగన్ అన్నారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లకు కూడా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ ఆధార్ కార్డులను లాక్కుని త‌మ‌కు ఓటువేయ‌క‌పోతే పింఛ‌ను క‌ట్ట‌యిపోతుందని టీడీపీ నేత‌లు బెదిరించార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 

  • Loading...

More Telugu News