: చంద్రబాబు అభివృద్ధి పనులకు ప్రజలు జై కొట్టారు!: సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు!


2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకే ఓటర్లు జై కొట్టారని... నంద్యాల గెలుపు అభివృద్ధికి ఫలితమని అన్నారు. ఈ ఎన్నిక ఫలితంతో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్ల టీడీపీ అధికారంలోకి రాలేదనే విషయాన్ని చంద్రబాబు నిరూపించారని తెలిపారు.

ఎవరి మద్దతు, సహకారం లేకుండానే టీడీపీ గెలుపొందగలదనే విషయాన్ని చంద్రబాబు మరోసారి స్పష్టం చేయగలిగారని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోరు పారేసుకునే జగన్, రోజాలాంటి వాళ్లకు నంద్యాల తీర్పు ఓ గుణపాఠమని ఎద్దేవా చేశారు. ఇప్పటి నుంచైనా వాస్తవాలను మాత్రమే జగన్ మాట్లాడాలని సూచించారు. ఏపీ బడ్జెట్ మొత్తం రూ. లక్ష కోట్లైతే... రూ. 3 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News