: చైనా బలగాలు సరిహద్దులోనే ఉంటాయి... చైనా విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్య!
`డోక్లాం సరిహద్దు వివాదం సద్దుమణిగింది... ఇరు దేశాల సైన్యాలు వెనక్కి వెళ్తున్నాయి` అంటూ భారత విదేశాంగ శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే చైనా విదేశాంగ శాఖ `అలాంటిదేం లేదు` అని సంచలన వ్యాఖ్యలు చేసింది. డోక్లాం సరిహద్దు నుంచి కేవలం భారత సైన్యాలు మాత్రమే వెనక్కి వెళ్లాయని, చైనా బలగాలు అక్కడే మోహరించి ఉంటాయని చైనా విదేశాంగ ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. సెప్టెంబర్‌లో చైనాలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉండటంతో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి డోక్లాం సరిహద్దు నుంచి సైనిక బలగాలను వెనక్కిపిలిపించాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.