: వైసీపీని జగన్ మూసుకోవాల్సిందే.. పీకేను ప్రజలే పీకేశారు: ఆదినారాయణ రెడ్డి


నంద్యాల నియోజకవర్గాన్నే కాకుండా, రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేయగలరనే నమ్మకంతోనే ఓటర్లు నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి పట్టం కట్టారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. అన్ని రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ను నంద్యాల ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందని... రానున్న రోజుల్లో వైసీపీ దుకాణాన్ని జగన్ మూసుకోవాల్సిందేనని అన్నారు. వైసీపీని నిలబెడతానంటూ వచ్చిన పీకే (ప్రశాంత్ కిషోర్)ను నంద్యాల ఓటర్లు పీకేశారని ఎద్దేవా చేశారు. పీకే ప్లాన్లు ఉప ఎన్నికలో వర్కౌట్ కాలేదని అన్నారు.

  • Loading...

More Telugu News