: నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం!
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు మిగిలి ఉండగానే విజయానికి అవసరమైన ఓట్లను టీడీపీ సాధించింది. పోలైన ఓట్లలో ఇప్పటికే 50 శాతం ఓట్లను టీడీపీ సొంతం చేసుకుని విజయాన్ని ఖరారు చేసుకుంది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 86,555 ఓట్లను సాధించగా, వైసీపీ 60,947 ఓట్లు పొందింది. ఇదిలా ఉండగా, టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డికి ఇప్పటికే పలువురు అభినందనలు తెలుపుతున్నారు.