: తొలిసారి... 16వ రౌండ్ లో శిల్పాకు ఆధిక్యం


విశ్లేషకులు ఊహించినట్టుగానే గోస్పాడు మండలంలో వైసీపీ ఆధిక్యతను కనబరిచింది. గోస్పాడులో పోలైన ఓట్లను 16వ రౌండ్ నుంచి లెక్కిస్తుండగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 654 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ మండలంలో దాదాపు 26 వేల ఓట్లుండగా, వాటిల్లో వైకాపాకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ముందు నుంచి రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రౌండ్లలో నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియనుండగా, ఈ మూడు రౌండ్లలో ఎంత ఆధిక్యం పొందినా శిల్పాకు విజయం అసాధ్యమే.

  • Loading...

More Telugu News