: సన్నీలియోన్ పై సీఏఆర్ ఏ మండిపాటు..జాతీయ బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు!


శృంగార తార సన్నీ లియోన్ దంపతులు దాదాపు రెండేళ్ల వయసు ఉన్న ఓ పాపను ఇటీవల దత్తత తీసుకున్నారు. సన్నీలియోన్, ఆమె భర్త  వెబర్ ఈ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆ చిన్నారి ఫొటోను, ఆమె రంగు, రూపురేఖలను బయటపెట్టడం ద్వారా ఆమె ప్రైవసీ (గోప్యత) కి భంగం కలిగించారంటూ కేంద్ర ప్రభుత్వంలోని సీఏఆర్ఏ (సెంట్రల్ అడాప్షన్ అథారిటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జువైనల్ జస్టిస్ యాక్ట్ ను ఉల్లంఘించారంటూ వారిపై మండిపడింది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే, చిన్నారిని దత్తత తీసుకున్నందుకు వారిని అభినందిస్తూనే సీఏఆర్ఏ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. 

  • Loading...

More Telugu News