: పన్నెండో రౌండ్ కూడా టీడీపీదే!
వరుసగా పన్నెండో రౌండ్ లో కూడా టీడీపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 1580 ఓట్ల మెజారిటీ సాధించారు. 12వ రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీకి 21,841 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా, 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. ఈ ఏడు రౌండ్లలోనూ తమ సత్తా కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు. కాగా, ఇప్పటివరకు ఏ రౌండ్ లోనూ ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన ఆధిక్యతను చాటుకోకపోవడం గమనార్హం.