: టీడీపీకి నలభై నుంచి యాభై వేల మెజార్టీ ఖాయం:మంత్రి నారాయణ


నంద్యాల ఉపఎన్నికల్లో ఇప్పటికే ఇరవై వేలకు పైగా మెజార్టీ సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మరింత మెజార్టీ సాధించడం ఖాయమని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భూమా బ్రహ్మానందరెడ్డికి నలభై నుంచి యాభై వేల మధ్య మెజార్టీ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే ఈ విజయానికి కారణమని అన్నారు. తమ పార్టీకి అఖండ విజయాన్ని అందించనున్న నంద్యాల ప్రజలకు తన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News