: పదకొండవ రౌండ్ లోనూ ‘సైకిల్’ స్పీడ్
వరుసగా పదకొండవ రౌండ్ లోనూ ‘సైకిల్’ స్పీడ్ గా దూసుకెళ్లింది. ఈ రౌండ్ లోనూ టీడీపీ 604 ఓట్లతో తన ఆధిక్యం కొనసాగించింది. పదకొండవ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 20,261 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, ప్రతి రౌండ్ లో టీడీపీ తన ఆధిక్యం కనబరుస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఆనందానికి హద్దుల్లేవు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. మొత్తం 19 రౌండ్లలో ఇప్పటికే పదకొండు రౌండ్లలో తన ఆధిక్యతను టీడీపీ చాటుకుంది.