: సింధూను చూసీ చూసీ నా పెట్రోల్ అయిపోయింది: సైనా నెహ్వాల్
గత రాత్రి గ్లాస్గోలో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ లో అద్భుత రీతిలో పోరాడి రజిత పతకానికే పీవీ సింధూ పరిమితమైనప్పటికీ, వేనోళ్లా ప్రశంసలను అందుకుంటోంది. ఆమె హైదరాబాద్ స్నేహితురాలు, మ్యాచ్ ఆసాంతం అభిమానుల మధ్య కూర్చుని వీక్షించిన ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, సింధూ ఆటతీరుపై స్పందిస్తూ, పొగడ్తలు గుప్పించింది. ఈ మ్యాచ్ లో సింధూ ఆటతీరు అద్భుతమని, ఫైనల్లో తాను ఆడివుంటే, కచ్చితంగా ఓడిపోయి ఉండేదాన్నని అంది.
"సింధూ మ్యాచ్ ని చూసీ చూసీ, నాలో పెట్రోల్ అయిపోయింది. నేను చూసిన మ్యాచ్ లలో ఇదో అద్భుతం. సింధూను ప్రోత్సహిస్తూ నేను అలసిపోయాను" అని వ్యాఖ్యానించింది. కాగా, సైనా నెహ్వాల్ వరల్డ్ చాంపియన్ షిప్ షటిల్ పోటీల్లో ఇండియాకు తొలి పతకాన్ని సాధించిన మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.