: ఆ వ్యాఖ్యలు చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు: భూమా అఖిలప్రియ
నంద్యాల ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్ కూడా రాదని నాడు ప్రచారం చేసిన నేతలకు ఈ ఫలితం చెంపపెట్టులాంటిదని ఏపీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, నంద్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. భూమా కుటుంబం, టీడీపీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే నంద్యాల ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని అన్నారు.