: 20 వేలు దాటిన భూమా మెజారిటీ... గెలుపు ఇక నల్లేరుపై నడకే!


నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు దాదాపు ఖాయమైంది. పదో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడింగా, శిల్పా మోహన్ రెడ్డి కన్నా భూమా 19,657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 11వ రౌండ్ కౌంటింగ్ సాగుతుండగా, భూమా మెజారిటీ 20 వేలను దాటేసినట్టు అనధికార వర్గాల సమాచారం. ఇప్పటివరకూ ఒక్క రౌండ్ లో కూడా శిల్పా ఆధిక్యత కనిపించలేదు. ఇక వైకాపా ఎన్నో ఆశలు పెట్టుకున్న గోస్పాడులో పూర్తి మెజారిటీ సాధించినా భూమాను అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గోస్పాడు మండలంలో పోల్ అయింది సుమారు 20 వేల ఓట్లు మాత్రమే కాబట్టి. ఈ నేపథ్యంలో నంద్యాల నూతన ఎమ్మెల్యేగా భూమా విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News