: తొమ్మిదో రౌండ్ లోనూ టీడీపీ అదే దూకుడు!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తొమ్మిదో రౌండ్ లోనూ టీడీపీ అదే దూకుడు కొనసాగించింది..ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండ్ లో 879 ఓట్ల మెజారిటీ సాధించింది. మొత్తం తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీకి 18,107 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా, మొదటి రౌండ్ నుంచి తొమ్మిదో రౌండ్ వరకు వరుసగా టీడీపీ తన ఆధిక్యతను కొనసాగిస్తుండటంపై టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు, మిగిలిన రౌండ్లలోనూ టీడీపీ కనబరుస్తుందని అన్నారు.