: జగనన్నకు, భారతి వదినకు పెళ్లి రోజు శుభాకాంక్షలు: వైసీపీ ఎమ్మెల్యే రోజా


వైసీపీ అధినేత జగన్, ఆయన భార్య భారతి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వారికి  ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఈ రోజు శుభ వివాహ దినోత్సవం సందర్భంగా జననేత జగనన్నకు మరియు భారతి వదినమ్మకు హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్, తన భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటోను రోజా పోస్ట్ చేశారు. కాగా, అంతకుముందు చేసిన పోస్ట్ లో రోజా తన ఇంట్లోని దేవుడి గదిలో పూజ చేస్తూ దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News