: తెలుగుదేశం పార్టీకి 40 వేల మెజార్టీ ఖాయం: గద్దె రామ్మోహన్


నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ అన్నారు. ఓటర్లను ప్రతిపక్ష వైసీపీ తక్కువగా అంచనా వేసిందని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగే అర్హత జగన్ కు లేదని...తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఉప ఎన్నక కోసం ఇన్ని రోజులపాటు ప్రచారం చేసిన ప్రతిపక్ష నేతను ఇంత వరకు చూడలేదని అన్నారు. జగన్ ప్రచారంతో ప్రజలు అభద్రతా భావానికి గురయ్యారని తెలిపారు. నంద్యాల రూరల్ మాదిరిగానే గోస్పాడులో కూడా టీడీపీకే మెజార్టీ వస్తుందని... మొత్తం మీద 40 వేల మెజార్టీతో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News