: కౌంటింగ్ ప్రాంతం నుంచి జారుకుంటున్న వైసీపీ నేతలు.. మీడియాతో కూడా మాట్లాడని వైనం!
నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించి.. 2019 ఎన్నికల దిశగా అడుగు వేయాలని భావించిన వైసీపీకి... కౌంటింగ్ లో వెల్లడవుతున్న ఫలితాలు షాకిస్తున్నాయి. ఇప్పటి దాకా ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడికాగా... అన్ని రౌండ్లలోనూ టీడీపీనే ఆధిక్యత సాధించింది. శిల్పా మోహన్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం నుంచి ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జారుకున్నారు. వీరితో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించినా... వారెవరూ మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేశారు.