: నంద్యాల టౌన్ ఓట్లన్నీ గంపగుత్తగా భూమాకే... మెజారిటీ 30 వేలు దాటే అవకాశం!


నంద్యాల రూరల్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 13 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి తెలుగుదేశం అభ్యర్థి భూమా నాగిరెడ్డి దూసుకెళ్లగా, నంద్యాల పట్టణ మండలం ఓట్ల లెక్కింపుతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైంది. టౌన్ ఓట్లలో మరింత ఆధిక్యాన్ని ఆయన చూపుతున్నారు. ఆరో రౌండ్ నుంచి టౌన్ ఓట్లను లెక్కిస్తుండగా, భూమా ఆధిక్యం మరో 3 వేలకు పైగా పెరిగింది. ఆరో రౌండ్ లో టీడీపీ 3,303 ఓట్ల మెజారిటీ రాగా, మొత్తం భూమా మెజారిటీ 16,465 ఓట్లకు చేరింది. ఆరు నుంచి 16వ రౌండ్ వరకూ టౌన్ ఓట్ల కౌంటింగ్ జరుగనుండగా, ఆపై మూడు రౌండ్లూ గోస్పాడు మండల ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ఇక ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ ను పరిశీలిస్తుంటే, భూమా బ్రహ్మానందరెడ్డి మెజారిటీ 30 వేల ఓట్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News