: వైసీపీకి మంచి పట్టు ఉన్న చోటే టీడీపీ హవా!


నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండగా, ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. 1 నుంచి 5వ రౌండ్ వరకు నంద్యాల రూరల్ ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఐదు రౌండ్లలో టీడీపీ ఆధిక్యం సాధించింది. అయితే, నంద్యాల రూరల్ లో వైసీపీకి మంచి పట్టు ఉన్నచోటనే టీడీపీ హవా కొనసాగుతుండటం గమనార్హం.

6 నుంచి 16వ రౌండ్ వరకు నంద్యాల అర్బన్ ఓట్లను లెక్కించనుండగా, 17 నుంచి 19వ రౌండ్ వరకు గోస్పాడు మండల ఓట్లను లెక్కించనున్నారు. కాగా, నంద్యాల అర్బన్ లో టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉండటంతో అక్కడ దాని ఆధిక్యం కొనసాగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక, గోస్పాడులోనూ టీడీపీ ఆధిక్యం కనబరుస్తుందనే ధీమాను టీడీపీ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News