: మా తల్లిదండ్రుల దీవెనతో బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయం: భూమా మౌనిక
తమ తల్లిదండ్రుల దీవెనలతో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు మౌనిక ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో టీడీపీకి మంచి మెజార్టీ రావడంపై ఆమె మాట్లాడుతూ, నంద్యాల రూరల్ లో టీడీపీకి భారీ మెజారిటీ రాబోతోందని అన్నారు. గోస్పాడులో రోడ్డు విస్తరణపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, వైసీపీ అసత్యప్రచారం చేసిందని ఆమె ఆరోపించారు. భూమా నాగిరెడ్డి నాయకత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందరెడ్డికీ ప్రజలకు పట్టం కడతారని అన్నారు. భూమా నాగిరెడ్డి కూతురిగా ప్రజలకు తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని, ఓ కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు.