: నంద్యాల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ఆందోళన!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, మీడియా ప్రతినిధులను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో, మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ పోలీసులకు, సంబంధిత అధికారులకు మీడియా ప్రతినిధులు చెప్పారు.