: ఇకపై ‘డేరా సచ్చా సౌధా’ను నడిపించే బాధ్యత గుర్మీత్ దత్తపుత్రికదే!
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు ఓ దత్త పుత్రిక ఉంది. ఆమె పేరు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్. ముప్పై సంవత్సరాల హనీ ప్రీత్ సింగ్, గుర్మీత్ నటించిన చిత్రాలకు దర్శకురాలు, ఎడిటర్ గా వ్యవహరిస్తుంటుంది. హనీ ప్రీత్ సింగ్ కు సొంతంగా ఓ వెబ్ సైట్ కూడా ఉంది. www.HoneypreetInsan.me అనే ఈ వెబ్ సైట్ లో ‘అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు’ అని రాసి ఉంటుంది. అయితే, ఆరోపణల కేసులో గుర్మీత్ సింగ్ కు జైలు శిక్ష తప్పదనే వార్తల నేపథ్యంలో డేరా సచ్చా సౌధా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆమెపైన ఉందని సమాచారం. కాగా, గుర్మీత్ సీబీఐ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన వెంట హనిప్రీత్ కూడా ఉన్నారు. హనిప్రీత్ సింగ్ కు ట్విట్టర్ లో పది లక్షల మంది, ఫేస్ బుక్ లో ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, గుర్మీత్ సింగ్ కు భార్య హర్జీత్ కౌర్, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.