: బాలయ్య ఏ సినిమా కోసమూ థియేటర్లకు డబ్బులివ్వలేదు: మోహన్ బాబు


సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అంటూ రికార్డులను, చరిత్రను సృష్టించడమే తప్ప, తన సినిమాలను ఆడించాలని కోరుతూ థియేటర్లకు బాలయ్య ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని, డబ్బిచ్చి తన సినిమాలను ఆడించలేదని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన 'పైసా వసూల్' ఆడియో సెలబ్రేషన్స్ వేడుక హైదరాబాద్ లో జరుగగా, మోహన్ బాబు చీఫ్ గెస్ట్ గా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రావాలని బాలయ్య స్వయంగా పిలిచాడని, తనకు చెన్నై వెళ్లాల్సిన పని వున్నా, ఇది తన ఇంటి ఫంక్షన్ గా భావించి వచ్చానని అన్నారు. ఇదే కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ, మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన్ను తరచూ కలుస్తుంటానని చెప్పారు. ఈ సినిమా గురించి తాను ఎన్నడూ పూరీ జగన్నాథ్ తో డిస్కస్ చేయలేదని, పని మొదలు పెడదామని అనుకుని స్టార్ట్ చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News