: రాముడి బాణాలు.. ఇస్రో రాకెట్ల లాంటివి: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
త్రేతాయుగంలో శ్రీరాముడు ఉపయోగించిన బాణాలు నేటి ఇస్రో రాకెట్ల లాంటివని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభివర్ణించారు. రాముడి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని కొనియాడిన ముఖ్యమంత్రి భారత్ -శ్రీలంక మధ్య రామసేతు నిర్మాణ సమయంలో ఎటువంటి ఇంజినీర్లు ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి ఊహించుకోవాలని ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. రాముడు సంధించిన ఒక్కో బాణం ఒక్కో క్షిపణిలాంటిదన్నారు. ఇప్పుడు ఇస్రో చేస్తున్న పనినే అప్పట్లో రాముడు చేశాడని అన్నారు. మణినగర్‌లోని మౌలిక సదుపాయాల సాంకేతిక పరిశోధన సంస్థ (ఐఐటీఆర్ఏఎం) స్నాతకోత్సవ వేడుకలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.