: ఉపఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ చెల్లనివే!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. నంద్యాలలో మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 250. తుది లెక్కింపు సమయానికి 247 బ్యాలెట్లు తిరిగి పంపకపోవడంతో వాటిని చెల్లనివిగా అధికారులు పరిగణించారు. వెనక్కి వచ్చిన 3 బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా అధికారులు నమోదు చేశారు. దీంతో, మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు పరిగణించారు.