: జస్ట్ మిస్! ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సింధుకు రజతం!
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఆదివారం రాత్రి జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు రజతంతో సరిపెట్టుకుంది. జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరాతో నువ్వా, నేనా.. అన్నట్టు సాగిన పోరులో సైనా ఓటమి పాలైంది. 1:50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడింది. చివరికి 19-21, 22-20, 20-22తో ప్రత్యర్థి ముందు సైనా తలవంచింది. ఫలితంగా రజతంతో సంతృప్తి చెందింది.
ఈ టోర్నీలో రజతం నెగ్గిన రెండో షట్లర్‌గా సైనా సరసన సింధు నిలిచింది. కాగా, సెమీస్‌లో ఒకుహరా చేతిలోనే ఓడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకోగా, సింధు ఆమె చేతిలోనే ఓడి రజతం గెలిచింది. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ తొలిసారి రెండు పతకాలు కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ స్వర్ణం కోసం చెమటోడ్చినా దురదృష్టవశాత్తు నెగ్గలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. రజతం మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొంది.