: నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం


నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రెండు, మూడు గంటల్లోనే ఉపఎన్నిక ఫలితం తేలనుంది. మొదట నంద్యాల గ్రామీణ మండలం, అనంతరం నంద్యాల పట్టణానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత గోస్పాడు పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

కాగా,14 టేబుళ్ల వద్ద నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ కు సుమారు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక్కో టేబుల్ వద్ద సూపర్ వైజర్, సహాయకుడు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థి సహా ఏజెంటుకు మాత్రమే ప్రవేశించే అనుమతి ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లాలంటే ఈసీ జారీ చేసిన పాసు తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రానిక్ తెరల ఏర్పాటు తో మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు.

  • Loading...

More Telugu News