: ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తం.. కారు బాంబు పేలుడులో 13 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్థాన్ మరోమారు రక్తమోడింది. హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన కారు బాంబు దాడిలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఇటీవల కాబూల్‌లోని ఓ షియా మసీదుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రమైన నవాలో ఈ ఘటన జరిగినట్టు హెల్మాండ్ గవర్నర్ అధికార ప్రతినిధి ఒమర్ జ్వాక్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.