: సినిమాల్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఎన్ని రీల్స్ ఉన్నాయి? అన్న ఆసక్తి వుండేది: రజనీకాంత్


సినిమాల్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఎన్ని రీల్స్ ఉన్నాయి? అనే రెండు విషయాలపై తనకు చిన్నప్పుడు ఆసక్తి ఉండేదని ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. చెన్నైలో ఇటీవల నిర్వహించిన స్టంట్ యూనియన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రజనీ, స్టంట్ డిపార్ట్ మెంట్ కు ఉన్న ప్రాధాన్యతను చెప్పారు. ఓ సినిమాకు దర్శకుడు, నిర్మాత ఎంత ముఖ్యమో, స్టంట్ కొరియోగ్రాఫర్, అతని అసిస్టెంట్స్ కూడా అంతే ముఖ్యమని అన్నారు.

 సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా శ్రమిస్తారని, స్టంట్ డిపార్ట్ మెంట్ మాత్రం శ్రమించడమే కాకుండా, రక్తం కూడా చిందిస్తుందని రజనీ ప్రశంసించారు. నాటి నటుడు ఎంజీఆర్ స్టంట్ యూనియన్ ని ప్రారంభించారని, ఈ యూనియన్ ఈ ఏడాది యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇదే ఏడాది ఎంజీఆర్ 100వ జయంతి కావడం, స్టంట్ యూనియన్ 50వ వార్షికోత్సవం కూడా అవడం యాదృచ్ఛికమని, ఆనందంగా ఉందని అన్నారు. ఎంజీఆర్ సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత కూడా స్టంట్ డిపార్ట్ మెంట్ లోని వ్యక్తులకు ఎంతో సహాయం చేశారని చెప్పిన రజనీ, ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే తనను కలవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News