: ‘అర్జున్ రెడ్డి’ అద్భుతం అంటున్న సమంత!
‘అర్జున్ రెడ్డి’ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రముఖ హీరోయిన్ సమంత కితాబిచ్చింది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది.‘ చాలా కాలం తర్వాత నేను చూసిన సహజసిద్ధమైన సినిమా ‘అర్జున్ రెడ్డి’. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్ వచ్చేశాయ్. ‘అర్జున్ రెడ్డి’ చిత్ర బృందం అద్భుతం!!’ అని తన ట్వీట్ లో సమంత పేర్కొంది. కాగా, రెండు రోజుల క్రితం ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించాడు.