: జాదవ్ డకౌట్.. బ్యాటింగ్ కు దిగిన ధోనీ
శ్రీలంకపై జరుగుతున్న మూడో వన్ డే మ్యాచ్ లో టీమిండియా నాల్గో వికెట్ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్ లో జాదవ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రెండు బంతులు ఆడిన జాదవ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ 56 పరుగులు, ధోనీ 4 పరుగులతో కొనసాగుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారతజట్టు 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.