: మాభూమి-ఫిదా గురించి ఆ విషయాలు చెప్పాలి!: సినీ నటుడు సాయిచంద్


కొన్నేళ్ల క్రితం 'మా భూమి' సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నాటి నటుడు సాయిచంద్ తన సెకండ్ ఇన్నింగ్స్ ‘ఫిదా’ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ మా భూమి సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాను. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించాను. అనంతరం చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్నా. మళ్లీ, ‘ఫిదా’ చిత్రం ద్వారా నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాను. ఈ సందర్భంగా మాభూమి-ఫిదా సినిమాల గురించి యాదృచ్ఛికరంగా జరిగిన విషయాలను మీకు చెప్పాలి. ‘మా భూమి’ తెలంగాణ నేపథ్యంలో ఇక్కడి యాసలో వచ్చిన చిత్రం. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ‘ఫిదా’లో కూడా తెలంగాణ భాషనే మాట్లాడతాను. మరో విషయం ఏంటంటే, ‘మా భూమి’ సినిమా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో నాడు విడుదలైంది. ‘ఫిదా’ కూడా ఇదే థియేటర్ కు వచ్చింది’ అని సాయిచంద్ చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News