: ముద్రగడను అడ్డుకున్న పోలీసులు


పాదయాత్ర తలపెట్టిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తూర్పు గోదావరి జిల్లాలోని వీరవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ముద్రగడ పాదయాత్రను స్థానిక పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారని, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని అన్నారు. ముద్రగడ చేసిన ప్రతి ఉద్యమంలో హింస నెలకొందని, కిర్లంపూడిలో ఏం జరిగినా ముద్రగడే బాధ్యత వహించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన ముద్రగడపై కేసులు పెడతామని ఈ సందర్భంగా సాంబశివరావు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News