: అక్కడ డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా: సీఎం చంద్రబాబు


‘అక్కడ డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా’ అంటూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక జగన్నాథపురంలో నిర్వహించిన ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ తీరు చిన్నప్పటి నుంచి అంతేనని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏదైనా మాట చెబితే.. టీవీలు పగలగొట్టేవాడని విమర్శించారు. జగన్ తీరు భరించలేకనే, ఆ తర్వాత బెంగళూరుకు పంపించి వేశాడని అన్నారు.

నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్ కు జ్వరం వచ్చిందని అన్నారు. పేదవాడికి తాను నిరంతరం అండగా ఉంటానని, కాకినాడ సిటీని తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాకినాడ కన్నెర్ర జేస్తే ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా రాదని, కాకినాడలోని 48 స్థానాల్లో టీడీపీయే గెలవాలని,టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. 

  • Loading...

More Telugu News