: విజయవాడ వీధుల్లో యువత కేరింతోత్సాహం!


నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో హ్యాపీ సండే నేడు వైభవంగా సాగింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ సమీపంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ యువకులు ఆడిపాడుతూ సందడి చేశారు. కృష్ణ తీరంలో ఏర్పాటైన ఆనంద ఆదివారం కార్యక్రమంలో కుర్రకారు ఉత్సాహంగా చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు యువతలో ఆనందాన్ని నింపడంతో పాటు ఆరోగ్య జీవితానికి అవసరమయ్యే వ్యాయామాన్ని అందిస్తాయని ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News