: నేటి పెట్రోలు, డీజిల్ ధరలు!
అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా నిత్యమూ పెట్రోలు, డీజిల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు ధరను 5 పైసల వరకూ పెంచాయి. ఇదే సమయంలో డీజిల్ ధరను 7 పైసల వరకూ పెంచుతున్నట్టు తెలిపాయి. ప్రస్తుతం పెట్రోలు ధర లీటరుకు రూ. 73.12 ఉండగా, డీజిల్ ధర రూ. 61.96కు పెరిగింది. వివిధ ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ: పెట్రోలు: రూ. 69.06, డీజిల్ రూ. 57.03
కోల్ కతా: పెట్రోలు రూ. 71.82, డీజిల్ రూ. 59.69
ముంబై: పెట్రోలు రూ. 78.18, డీజిల్ రూ. 60.58
చెన్నై: పెట్రోలు రూ. 71.56, డీజిల్ రూ. 60.04
హైదరాబాద్: పెట్రోలు రూ. 73.12, డీజిల్ రూ. 61.96