: క్రికెట్ బెట్టింగుల్లో ఉన్నోళ్లకు ఓట్లేస్తే అమ్మేస్తారు.. కాకినాడ ఓటర్లను హెచ్చరించిన చంద్రబాబు


క్రికెట్ బెట్టింగుల్లో ఉండే విపక్ష నాయకులకు ఓటేస్తే దానిని వారు బెట్టింగుల్లో అమ్మేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. వారికి ఓటేస్తే కాకినాడను మరో పులివెందులలా మార్చేస్తారన్నారు. క్రికెట్ బెట్టింగుల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే వారు కాకినాడ ఎన్నికల్లో దిగారన్నారు.

 అభివృద్ధికి అడ్డుపడుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏటీఎంలలో దొంగనోట్లు పెట్టి డబ్బులు కాజేసే ముఠా అంటూ కాకినాడ గత పాలకుల అకృత్యాలను ఎండగట్టారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని చంద్రబాబు జోస్యం చెప్పారు. నగరంలోని 48 డివిజన్లలోనూ టీడీపీని గెలిపించాలని,   జెట్ స్పీడ్‌తో నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కాకినాడ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. 29న పోలింగ్ జరుగుతుంది.

  • Loading...

More Telugu News