: సైనా సాధించలేని చోట సత్తా చాటిన సింధు... వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఫైనల్ కు


వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో సెమీస్ వరకూ దూసుకొచ్చిన భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులలో సింధు ముందడుగు వేయగా, సైనా చతికిలబడింది. గంటా 14 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో సైనా నెహ్వాల్, వరల్డ్ నంబర్ 12 క్రీడాకారిణి, నోజోమి ఒకుహరా చేతిలో 12-21, 21-17, 21-10 తేడాతో ఓడిపోయింది.

ఆపై జరిగిన మరో మ్యాచ్ లో పీవీ సింధు, 10వ నంబర్ క్రీడాకారిణి, చైనాకు చెందిన చెన్ యుఫీపై 21-13, 21-10 తేడాతో సునాయాస విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్ మ్యాచ్ సింధు, నోజోమి మధ్య జరుగనుండగా, సైనా నెహ్వాల్ కాంస్య పతకానికి పరిమితమైంది. 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలకు పరిమితమైన సింధు, ఈ దఫా స్వర్ణం లేదా రజత పతకాన్ని ఖాయం చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News