: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం!
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రోజు సాయంత్రం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, కూకట్ పల్లి, కోఠి, అబిడ్స్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.