: పవన్ కన్నా మహేశ్ బాబు పెద్ద స్టార్.. కల్యాణ్ ను నెత్తినవేసుకుని తిరగడం ఫ్యాన్స్‌కి అలవాటైంది!: మహేశ్ కత్తి
సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై మండిపడ్డాడు. తాను తన పబ్లిసిటీ కోసం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం లేదని అన్నారు. ఒకవేళ తాను పబ్లిసిటీ కోసమే విమర్శలు చేస్తే పవన్ గురించి మాట్లాడడం కన్నా మహేశ్ బాబు గురించి మాట్లాడితే ఎక్కువగా పబ్లిసిటీ వస్తుందని అన్నారు. పవన్ కన్నా మహేశ్ బాబు పెద్ద స్టార్ అని అన్నారు.
పవన్ కల్యాణ్ ఆయన అభిమానులకు స్టార్ అని, తనకు కాదని మహేశ్ కత్తి అన్నారు. తాను అందరి గురించీ మాట్లాడతానని పవన్ కల్యాణ్ గురించే కాదని అన్నారు. తాను ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్‌పై మాట్లాడిన మూడు నిమిషాలే చూశారని, మిగతాది చూడకుండానే అభిమానులు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తోన్న అనవసరపు రచ్చ వల్లే తనకు ఎక్కడలేని పబ్లిసిటీ వస్తోందని అన్నారు. తాను ఓ సెలబ్రిటీ కాదని, పవన్ ఫ్యాన్సే తనను సెలబ్రిటీని చేస్తున్నారని అన్నారు. తన మొబైల్ నెంబర్‌ను అన్ని వాట్సప్ గ్రూపులలోను పెట్టి తనను హింసిస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ను నెత్తినవేసుకుని తిరగడం ఫ్యాన్స్‌కి అలవాటయిపోయిందని అన్నారు.