: ఐఫోన్-8 లోని అద్భుత ఫీచర్లలో వైర్ లెస్ ఛార్జర్ కూడా!
ఐఫోన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న నెక్ట్స్ జనరేషన్ ‘ఐఫోన్-8’ వచ్చేనెల 12న విడుదలకానున్న విషయం తెలిసిందే. ఆపిల్ నుంచి ఈ ఐఫోన్ విడుదల కానుందని తెలిసినప్పటి నుంచి ఈ ఫోన్ ఫీచర్లపై ఎన్నో రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఐఫోన్ వైర్ లెస్ ఛార్జర్‌తో వస్తోందని ప్రధానంగా ప్రచారం జరిగింది. అయితే, ఇది రూమర్ కాదని, ఐఫోన్ 8లో నిజంగానే ఈ అద్భుత ఫీచర్ ఉంటుందని ప్రముఖ వెబ్‌సైట్ టీఎన్‌డబ్యూ పేర్కొంది.
ఇప్పటివరకు ఆపిల్ ప్రతినిధుల నుంచి ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రానప్పటికీ, ఈ ఐఫోన్ లోని ఇతర ఫీచర్లను గమనించి చూస్తే ఈ ఫోన్ వైర్ లెస్ ఛార్జర్ టెక్నాలజీతోనే వస్తోందని తమకు తెలిసిందని తేల్చిచెప్పింది. ఈ వైర్ లెస్ ఛార్జర్‌లో పలు ప్రత్యేకతలూ ఉన్నాయని చెప్పింది. ఈ ఛార్జర్‌తో వేగంగా ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చని, అంతేగాక, ఈ ఛార్జర్ ఇతర మొబైల్ డివైస్‌లకు కూడా పనిచేస్తుందని తెలిపింది.