: జగన్ కు చలిజ్వరం పట్టుకుంది: ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా


నిజాయతీగా ఉన్న టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజాలాంటి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ను దోచుకున్నదే వైసీపీ నేతలని... దీనిపై చర్చకు రావాలని అసెంబ్లీలో సవాల్ విసిరితే... పారిపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ పట్ల జనాలకున్న ఆదరణను చూసిన వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని... అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.

నంద్యాలలో వైసీపీ నేతలను తరిమికొట్టారని... అయినా ఇప్పుడు కాకినాడకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి వైసీపీ అధినేత జగన్ కు చలిజ్వరం పట్టుకుందని... ఈ రోజు కాకినాడ ప్రచారానికి రావాల్సిన ఆయన, చలిజ్వరం సాకు చూపి ఇంట్లోనే ఉండిపోయారని అన్నారు. ప్రజలంతా చంద్రబాబు వెంట ఉన్నారని... అవినీతిపరులు, అరాచకవాదులతో నిండిపోయిన వైసీపీని ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంటుందని... 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు.

  • Loading...

More Telugu News