: 'పోకిరి' సినిమా డైలాగ్ ను వాడిన ఎమ్మెల్యే రోజా!


కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీల నేతలు సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన ప్రసంగంలో మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమాలోని డైలాగ్ ను వాడారు. "ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... వారే కాకినాడ ఓటర్లు" అనే విషయాన్ని చాటి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఓటుతో తెలుగుదేశం ప్రభుత్వానికి కాకినాడ ఓటర్లు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంతో ఆవేశపూరితంగా కొనసాగిన తన ప్రసంగంలో టీడీపీపై రోజా పలు విమర్శలు గుప్పించారు. వీధికొక మద్యం షాపును ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని ఆమె చెప్పారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా చోటు దక్కలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News