: ఆశ్రమమైనా, జైలైనా డేరా బాబాకు ఒకటే.. సకల భోగాలు అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్
అత్యాచార కేసులో డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ సింగ్ ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చడంతో... కోర్టు నుంచి ఆయనను రోహ్ తక్ జైలుకు తరలించారు. అయితే, జైలుకు వెళ్లినా ఆయనకు రాచమర్యాదలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించడమే కాకుండా, ప్రత్యేక రూమ్, సహాయకుడిని ఏర్పాటు చేసినట్టు సమాచారం.
బాబాకు అతని దత్త పుత్రికగా చెప్పుకుంటున్న ప్రముఖ సినీ దర్శకురాలు జీతూ సకల మర్యాదలు చేస్తోందట. సీబీఐ కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో కూడా జీతూ ఆయనతో పాటే హెలికాప్టర్ లో ఉంది. మరోవైపు 100 ఎకరాల్లో ఉన్న బాబా ఆశ్రమాన్ని చూసి, పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రత్యేకమైన రూమ్ లు, మసాజ్ సెంటర్లు, విలాసవంతమైన భవంతులతో పాటు ఓ పబ్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు.