: ఇంకా కోలుకోని జగన్.. కాకినాడ పర్యటన వాయిదా!
వైసీపీ అధినేత జగన్ కాకినాడ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఈరోజు ఆయన కాకినాడ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 15 రోజులకు పైగా అక్కడే మకాం వేసి, గడపగడపకూ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో, ఆయన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. దీంతో మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో... కాకినాడ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.