: 'నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతే రోజానే బాధ్యురాలిని చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారట?' అనే ప్రశ్నకు రోజా సమాధానం!
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ కు ఆమె ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే నో ప్రాబ్లం... ఒకవేళ ఓడిపోతే రోజానే బాధ్యురాలని చేయాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్టు, ప్రచారంలో అఖలప్రియపై రోజా చేసిన వ్యాఖ్యల వల్లనే ఓటమిని మూటగట్టుకున్నట్టు మీ పార్టీ నేతలు భావిస్తున్నారనే వార్తల్లో వాస్తవం ఎంత? అని సదరు ఛానల్ రోజాను ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా, చంద్రబాబులాగో, లోకేష్ లాగో తాను నోరు జారో, తొందరపడో ఏదీ మాట్లాడనని... తాను ఏది మాట్లాడినా పూర్తిగా ఆలోచించే మాట్లాడుతానని ఆమె అన్నారు. ఈ విషయంపై ఎవరు డిస్కషన్ కు వచ్చినా తాను డిస్కస్ చేయగలనని చెప్పారు. తాను మాట్లాడిన విషయాలకు ఎప్పుడూ సారీ చెప్పనని అన్నారు. ఇది వైసీపీ నేతల ఆలోచన కాదని, టీడీపీ నేతలే వైసీపీ పేరుతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని... తనపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కాకినాడ ప్రజలు రమ్మంటేనే తాను ప్రచారానికి వచ్చానని... టైమ్ పాస్ కోసం వచ్చే క్యారెక్టర్ తనది కాదని తెలిపారు.